Sunday, December 22, 2024

గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

వాజేడు : ఈ మధ్య కాలంలో పెద్ద చిన్న తేడా లేకుండా చాలా మంది అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సూత్రపు హరిచందర్ అనే బాలుడుకి ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు హఠాన్మరణం చెందడంతో తల్లిదండ్రులు సోకసంద్రంలోకి మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News