Wednesday, January 22, 2025

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడు మృతిచెందిన సంఘటన సనత్‌నగర్‌లో చోటుచేసుకుంది. సనత్‌నగర్‌కు చెందిన కార్తికేయ(12) స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగా బాల్ పక్కనే ఉన్న జిహెచ్‌ఎంసి ఇండోర్ స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్‌లో పడింది. ఆదివారం కావడంతో స్విమ్మింగ్‌పూల్ మూసి ఉంది. బాల్ తీసుకుని వచ్చేందుకు గొడదూకి వెళ్లిన బాలుడు బాలు తీస్తుండగా స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతిచెందాడు. కార్తికేయకు స్విమ్మింగ్ రాకపోవడంతో అందులోపడి మృతిచెందాడు.

బాల్ తీసుకుని వచ్చేందుకు వెళ్లిన కార్తికేయ చాలా సేపయినా బయటికి రాకపోవడంతో అతడి స్నేహితులు అతడి తల్లిదండ్రులకు చెప్పారు. వారు వెంటనే అక్కడికి వచ్చి చూసేసరికి స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి ఉన్నాడు. వెంటనే బయటికి తీయగా అప్పటికే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సనత్‌నగర్ పోలీసులు బాలుడిని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News