Monday, December 23, 2024

12 ఏళ్ల బాలికపై అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై , నడిరోడ్డుపై అర్ధనగ్న స్థితిలో రక్తమోడుతూ సాయం కోరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు సరికదా చీదరించుకున్నారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో జరిగింది. ఆ బాలిక రక్తస్రావంతో వీధుల్లో నడుస్తూ కనిపించింది. ఎవరో అత్యాచారం చేసి నగరం లోని బాద్‌నగర్ రోడ్డు లోని దండి ఆశ్రమ సమీపంలో విసిరేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియోలో అమ్మాయి తనని కప్పి ఉంచుకోని గుడ్డతో రోడ్డుపై నడుస్తున్నట్టు ,ఆమె సహాయం కోరగా, ఒక వ్యక్తి ఆమెను తరిమికొట్టడం వీడియోలో కనిపించింది.

ఆమె అలాగే నడుచుకుంటూ ఓ ఆశ్రమ ప్రాంగణం లోకి వెళ్లగా, అక్కడి నిర్వాహకులు ఆమెపై అత్యాచారం జరిగిందని అనుమానించి , స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నందున అక్కడి నుంచి ఆమెను చికిత్స కోసం ఇండోర్‌కు తరలించారు. దోషులను పట్టుకోడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైందని సీనియర్ పోలీస్ అధికారి సచిన్ శర్మ చెప్పారు. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోయింది. ఆమె మాట తీరు చూస్తే ప్రయాగ్ రాజ్‌కి చెందినదని తెలుస్తోందని సచిన్ శర్మ తెలిపారు. దీనిపై బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ దర్యాప్తు నివేదిక కోరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News