Wednesday, January 22, 2025

భగత్ సింగ్ ఉరి ఘట్టం రిహార్సల్స్ చేస్తూ 12 ఏళ్ల బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

12-yr-old boy dies while rehearsal of Bhagat Singh execution scene

చిత్రదుర్గ: కర్ణాటక లోని చిత్రదుర్గ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ ఉరి సన్నివేశం రిహార్సల్స్ చేస్తూ 12 ఏళ్ల బాలుడు సంజయ్ గౌడ మృతి చెందాడు. గత శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం స్థానిక ఎస్‌ఎల్‌వీ పాఠశాలలో సంజయ్ గౌడ ఏడో తరగతి చదువుతున్నాడు. నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల సందర్భంగా కళాశాలలో భగత్‌సింగ్ నాటకం వేయాల్సి ఉంది. ఇందులో భగత్ సింగ్ పాత్ర అతనికి అప్పగించారు. ఇందుకోసం ఇంట్లో రిహార్సల్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మరణించాడు. ఇంట్లో వాళ్లంతా పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

“నాటకం రిహార్సల్స్ కోసం రూములో ఒక తాడును ఫ్యానుకు కట్టినట్టు కనిపిస్తోంది. ఉలెన్ క్యాప్‌ను తలకు తొడుక్కుని, మెడ చుట్టూ ఉచ్చువేసుకున్నాడు. మంచం మీద నుంచి కిందకు దూకడంతో నిమిషాల్లోనే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినట్టు కనిపిస్తోంది. ”అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు వెల్లడించారు.

12-yr-old boy dies while rehearsal of Bhagat Singh execution scene

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News