వెబ్ డెస్క్: అత్యాచారానికి గురైన ఒక 12 ఏళ్ల మైనర్ బాలిక రక్తంతో తడిసిపోయిన దుస్తులతో అర్ధనగ్నంగా సహాయం కోసం అర్థిస్తున్న వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. అయితే ఆ బాలికకు సాయం చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం విషాదం.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ వీధులలో ఒక మైనర్ బాలిక రక్తంతో తడిసిన దుస్తులతో ఇంటింటికి వెళుతూ సాయం కోసం అర్థిస్తున్న దృశ్యాలు సిసి టివిలో రికార్డయ్యాయి. తీవ్ర గాయాలతో ఆ బాలిక వేడుకుంటున్నా సాయం చేసే చేయి ఒక్కటి కూడా అక్కడ కనిపించలేదు. దాదాపు రెంటున్నర గంటలపాటు ఆ బాలిక వీధులలో తిరుగుతున్న దృశ్యాన్ని సిసిటివిలు రికార్డు చేశాయి. కాగా కొందరు స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఆ మైనర్ బాలిక అత్యాచారానికి గురైనట్లు డాక్టర్లు నిర్ధారించడంతో గుర్తు తెలియని వ్యక్తులపై మహాకాల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు ఉజ్జయిన్ జిల్లా ఎస్‌పి సచిన్ శర్మ బుధవారం విలేకరులకు తెలిపారు.
మహాకాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ముర్లిపురా ప్రాంతంలో రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో మైనర్ బాలిక కనిపించినట్లు ఎస్‌పి తెలిపారు.
బాధిత బాలిక పరిస్థితి విషమంగా ఉడడంతో ఆమెను ఇండోర్‌లోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఒక పోలీసు అధికారి ఆమెకు రక్తదానం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
On Camera, 12-Year-Old Girl, Raped And Bleeding, Asks For Help, Shooed Away@Anurag_Dwary reports
Read here: https://t.co/gYx8RKulRb pic.twitter.com/0hiyE5SYUA
— NDTV (@ndtv) September 27, 2023