Monday, December 23, 2024

120 కోట్లతో కల్వకుర్తి లో అభివృద్ధి చేశా: ఎంఎల్ఎ జైపాల్

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : కల్వకుర్తి నియోజకవర్గాన్ని 120 కోట్లతో సమగ్రాభివృద్ధి చేశానని కల్వకుర్తి ఎంఎల్ఎ జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని డబుల్ బెడ్ రూం ఇండ్లను ఎంఎల్ఎ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్లకు విద్యుత్ ఏర్పాటుకు ఇప్పటికే 22 లక్షల రూపాయలు మంజూరు చేశానని ఎంఎల్ఎ అన్నారు. మరో 30 లక్షల నిధులకు ప్రతిపాదనలు పంపుతానని అన్నారు.
మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలి
డబుల్ బెడ్ రూం ఇండ్ల అసంపూర్తి పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఎంఎల్ఎ జైపాల్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ నీటి కనెక్షన్, విద్యుత్ సరఫరా, మిగతా పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. 240 డబుల్ బెడ్ రూం ఇళ్లు మరో మూడు నెలల్లో ఇల్లు లేని పేదలకు రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిసరాల్లో నిఘా పెంచండి
డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిసరాలలో పోలీస్ అధికారులు నిఘా పెంచాలని ఎంఎల్ఎ జైపాల్ యాదవ్ పోలీస్ అధికారులు ఆదేశించారు. సంగీత కార్యకలాపాలకు డబల్ బెడ్ రూం ఇళ్లు అడ్డాగా నిలుస్తున్నాయని పలువురు ఎంఎల్ఎకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎంఎల్ఎ స్పందిస్తూ డబుల్ బెడ్ రూం, స్టేడియం ప్రాంతాలలో పెట్రోలింగ్ నిఘాలు పెంచాలని అన్నారు. ఎంఎల్ఎ వెంట మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మెన్, కల్వకుర్తి ఎంపిపి సామ మనోహర చెన్నకేశవులు,

వైస్ ఎంపిపి కొండూరు గోవర్ధన్ గుప్తా, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ వట్టపు బాలయ్య, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సింగం విజయ్ గౌడ్, యువజన విభాగం జిల్లా నాయకులు జమ్ముల శ్రీకాంత్, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు బన్ని శ్రీధర్, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News