Saturday, November 16, 2024

విషాద ఘటన.. కన్నబిడ్డ శవంతో 120 కి.మీటర్లు స్కూటీపైనే ప్రయాణం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కన్నబిడ్డ చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు కన్నీటిని దిగమింగుతూనే 120 కిలోమీటర్లు స్కూటీపైనే మృతదేహంతో ప్రయాణించారు. ఎపిలోని విశాఖ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ చిన్నారి చికిత్స కోసం అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడ గ్రామానికి చెందిన ఓ గిరిజన దంపతులు విశాఖలోని కెజిహెచ్ ఆసుపత్రికి వచ్చారు. చికిత్స పొందుతున్న క్రమంలో చిన్నారి మృతి చెందింది.

దీంతో మృతదేహాన్ని తరలించేందుకు విశాఖలోని కెజిహెచ్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోడం, ప్రైవేటు అంబులెన్స్‌లో తరలించే స్తోమత లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు విశాఖ నుంచి పాడేరు వరకు స్కూటీపైనే మృతదేహాన్ని తరలించారు. అంబులెన్స్ కోసం ఎంతలా ప్రాధేయపడినా కెజిహెచ్ సిబ్బంది కనికరించలేదని, అందువలనే గత్యంతరం లేక స్కూటీపై బిడ్డ మృతదేహాన్ని తరలించినట్లు బాధిత తల్లిదండ్రుల చెబుతున్నారు. కెజిహెచ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షం వలనే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News