- Advertisement -
హైదరాబాద్: గతంలో చేనేత రంగానికి బడ్జెట్‌లో రూ.70 కోట్లు కేటాయిస్తే కెసిఆర్ ప్రభుత్వం రూ.1200 కోట్లకు పెంచిందని చేనేత, జౌళిశాఖ సెక్రటరీ డైరెక్టర్ శైలజారామయ్యర్ తెలిపారు. పీపుల్స్ ప్లాజాలో జాతీయ దినోత్సవ కార్యక్రమంలో శైలజారామయ్యర్ మాట్లాడారు. మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసి చేనేత కార్మికులకు సహకారం అందిస్తున్నామన్నారు. చేనేతల్లో కొత్త డిజైన్‌లు, సాంకేతికతపై ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తున్నామన్నారు. 2016 నుంచి చేనేత వస్త్ర ప్రదర్శనలు, పురస్కారాలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కెటిఆర్, ఎంఎల్‌ఎ విద్యాసాగర్ రావు, వరంగల్ మేయర్ సుధారాణి, చేనేత, జౌళిశాఖ సెక్రటరీ డైరెక్టర్ శైలజారామయ్యర్ పాల్గొన్నారు.
- Advertisement -