Thursday, January 23, 2025

తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు: పవన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో బిజెపిలో కలిసి ఎన్నికల బరిలో నిలిచామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కొత్తగూడెంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఎపిలో రౌడీలు, గుండాలను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. తన ఇజం.. హ్యూమనిజమన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులు తనకు స్ఫూర్తి అని ప్రశంసించారు. బిజెపి పోటీ చేస్తున్న స్థానాల్లో జనసైనికులు మద్దతు ఇవ్వాలని పవన్ కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు ఇచ్చారని పవన్ గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితోనే ఎపి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని ధ్వజమెత్తారు. యువత అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే జనసేన అండగా నిలబడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News