Sunday, December 22, 2024

హాథ్రస్‌ తొక్కిసలాట ఘటనలో 121కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -
- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్ లోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 121కి చేరింది. ఇందులో 113 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు, ఒక పురుషుడు ఉన్నారు. నిన్న రాత్రి వరకు 116 మంది మరణించగా.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ బుధవారం మరో ఐదుగురు చనిపోయారు. ప్రస్తుతం వందల మంది చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై స్పందించిన బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. కాగా, ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసిన భోలే బాబా పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాబా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News