Monday, December 23, 2024

నూతన కలెక్టరేట్‌లో తొలి ప్రజావాణికి 122 ఫిర్యాదులు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కే ంద్రలోని నూతన కలెక్టరేట్‌లో తొలి సారిగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్ర జలనుంచి వివిధ సమస్య లపై వచ్చిన 122 దరఖాస్తులను స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ సభావట్ మోతిలాల్ తెలిపారు. ప్ర జల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశి ంచారు.

ప్రతి ఫిర్యాదును అధికారులు జవాబుదారితనంగా స్వీకరించి పరిష్కరించాలన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ప్రతి శాఖ అంకిత భావంతో పనిచేయాలన్నారు. ప్రతి ఉద్యోగి ప్రజలకు అంకిత భావంతో నిస్వార్థంగా సేవలందించినప్పుడే వారు ప్రజాభిమానాన్ని చురగొంటారని ఉద్యోగు లకు సూచించారు. జిల్లాలో దశాబ్ది దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు.

డిఆర్‌డిఓ నర్సింగ్ రావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూపాల్ రెడ్డి, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి నటరాజ్ ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News