Wednesday, January 22, 2025

అమాంతం పెరిగిన కరోనా కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

12213 new covid cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా 8 వేలకు పైగా నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య తాజాగా 12 వేల మార్కు దాటింది. ముందు రోజు కంటే 38.4 శాతం అధికంగా రావడం ఆందోళన కలిగించే అంశం. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం బుధవారం 5.19 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 12,213 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 2.35 శాతానికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఈ స్థాయి వ్యాప్తి కనిపించింది. మహారాష్ట్ర (4024), కేరళ (3488). ఢిల్లీ, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. ఒక్క ముంబై లోనే బుధవారం రెండు వేలకు పైగా కేసులొచ్చాయి. ఐదు నెలల తరువాత అక్కడ అవే అత్యధిక కేసులు కావడం గమనార్హం.

ఢిల్లీలో వరుసగా రెండో రోజు 1100 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఈ రెండేళ్లలో మొత్తం 4.32 కోట్ల మందికి ఈ మహమ్మారి సోకింది. తాజా విజృంభణతో క్రియాశీల కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 58215 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో దీని వాటా 0.12శాతంగా ఉంది. 24 గంటల్లో 7624 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 4.26 కోట్ల మందికి పైగా కోలుకోవడంతో రికవరీ రేటు 98.66 శాతంగా కొనసాగుతోంది. బుధవారం 11 మందిప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిన్నర కాలంలో 195 కోట్లకు టీకా డోసులు పంపిణీ అయ్యాయి. బుధవారం 15.21 లక్షల మంది టీకా తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News