న్యూఢిల్లీ : దేశంలో ముందు రోజు 10 వేలకు దిగువన నమోదైన కరోనా కొత్త కేసులు మరోసారి 12 వేలు దాటాయి. క్రమేపీ పెరుగుతోన్న క్రియాశీల కేసులు 81 వేలు దాటి ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం 3.10 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 12,249 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో పాజిటివిటీ రేటు 3.94 శాతానికి ఎగబాకింది. కొత్త కేసులో సగానికి పైగా మహారాష్ట్ర (3659), కేరళ (2609) నుంచే వచ్చాయి.
ఢిల్లీలో వెయ్యికి పైగా కొత్త కేసులు రాగా, కర్ణాటక, తమిళనాడు, హర్యాణా, సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 4.32 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా, అందులో 4.27 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. మంగళవారం 9862 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం మహమ్మారితో బాధపడుతోన్న వారి (క్రియాశీల కేసులు) సంఖ్య 81,687కి చేరింది. రికవరీ రేటు 98.60 శాతానికి తగ్గగా, క్రియాశీల రేటు 0.19 శాతానికి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 13 మరణాలు సంభవించాయి. మంగళవారం 12.28 లక్షల మంది టీకా వేయించుకోగా, మొత్తం 196 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.