Monday, December 23, 2024

0.03 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు

- Advertisement -
- Advertisement -

1233 new covid cases reported in india

1200 కు దిగొచ్చిన కొత్త కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా 6.24 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1233 మందికి వైరస్ సోకినట్టు తేలింది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు రెండు వేల దిగువకు , పాజిటివిటీ రేటు ఒకశాతం లోపునే నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 31 మంది మరణించారు. మంగళవారం 1876 మంది కోలుకోగా, రికవరీ రేటు 98.75 శాతానికి పెరిగింది. తాజాగా క్రియాశీల కేసులు ఇంకాస్త తగ్గి , 15 వేల దిగువకు చేరాయి. దాంతో క్రియాశీల రేటు 0.03 శాతానికి క్షీణించింది. ఇప్పటివరకు దేశంలో 4.30 కోట్ల కరోనా కేసులు రాగా, 5.21 లక్షల మంది మరణించారు. ఈ వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్రం మొదలు పెట్టిన టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. దాని కింద 183 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. మంగళవారం 26.34 లక్షల మంది టీకా తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News