Sunday, December 22, 2024

నిమిషానికి 1244 బిర్యానీల ఆర్డర్… కండోమ్‌లు ఎన్నంటే?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిసెంబర్ 31 రాత్రి ప్రజలు మందు, విందుతోనే ఎక్కువగా గడిపారు. గత వారం రోజుల నుంచి రూ.1000 కోట్ల మద్యాన్ని ప్రజలు తాగినట్టు అబ్కారీ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 31 ఒక్క రోజే నిమిషానికి 1244 బిర్యానీలు ఆర్డర్ వచ్చినట్టు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వివరించింది. గత సంవత్సర రికార్డు తిరగ రాసి 4.8 లక్షల బిర్యానీల ఆర్డర్ లతో 2024 కొత్త సంవత్సరం రికార్డు సృష్టించింది. గతంలో కంటే 160 శాతం ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా 1.3 లక్షల ఆర్డర్లు వచ్చినట్టు వివరించింది. దేశ వ్యాప్తంగా నిమిషానికి 1722 కండోమ్‌లు ఆర్డర్ చేసినట్టు స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News