126మందిని బదిలీ చేసిన సిపి
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 126 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫిన్ రవీంద్ర ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. కొత్త పోస్టుల్లో వెంటనే చేరాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశించారు. శంకర్‌పల్లిలో పనిచేస్తున్న సంజీవ్‌ను జగద్గిగిరిగుట్టకు, గచ్చిబౌలిలో పనిచేస్తున్న రమేష్‌ను సిసిఆర్‌బికి, నార్సింగిలో పనిచేస్తున్న రాములను రాజేంద్రనగర్ పిఎస్‌కు, జగద్గిగిరిగుట్టలో పనిచేస్తున్న ఎస్సై రాములను సిసిఎస్ శంషాబాద్, షీటీమ్స్‌లో పనిచేస్తున్న పోచయ్యను ఎస్‌బికి, చందానగర్‌లో పనిచేస్తున్న అహ్మద్‌పాషాను జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు, నరేందర్ రెడ్డిని రాయదుర్గం నుంచి గచ్చిబౌలికి, సైదులును రాయదుర్గం నుంచి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
ఎస్‌బి రిపోర్టే కీలకం ….
ఎస్సైల బదిలీలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఎస్‌బి నుంచి ప్రతి ఎస్సైకి సంబంధించిన రిపోర్టును తీసుకుని బదిలీ చేసినట్లు తెలిసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పిఎస్‌లకు కేటాయించకుండా లూప్‌లైన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. మాదాపూర్ జోన్‌లో పనిచేస్తున్న పలువురు ఎస్సైలు మూడేళ్ల నుంచి ఒకే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. వారిపై గత కొంత కాలం నుంచి పలు ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సైలను ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేశారు.