Wednesday, January 22, 2025

అయోధ్యకు 1265 కేజీల భారీ లడ్డూ.. తయారు చేసింది మన హైదరాబాద్ లోనే..

- Advertisement -
- Advertisement -

అయోధ్య రామాలయానికి సంబంధించిన పలు అంశాల్లో పాలుపంచుకుంటూ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. అయోధ్య రామ మందిరానికి తలుపులను మన హైదరాబాద్ లోనే తయారు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో అరుదైన గుర్తింపు తెలంగాణకు లభించనుంది. అయోధ్య రామాలయానికి భారీ లడ్డూ హైదరాబాద్ నుంచే వెళ్లనుంది. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ పికెట్‌ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్‌ సర్వీసెస్‌ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా భారీ లడ్డును తయారు చేయించారు.

ఆలయానికి భూమి పూజ చేసినప్పటి నుంచి రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట చేసేందుకు ఎన్ని రోజులు పడుతుందో అన్ని కేజీల లడ్డూను తయారు చేసి.. శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించాలని నిర్ణయించుకున్నామని.. ఈ క్రమంలో ఆలయ ట్రస్టును కలిసి అనుమతులు తీసున్నామని నాగభూషణం రెడ్డి తెలిపారు. వారి సూచనలతో 1,265 కేజీల ప్రత్యేక లడ్డూను తయారు చేశామని.. బుధవారం శోభాయాత్రతో ఈ లడ్డూ అయోధ్యకు బయల్దేరనున్నట్లు చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ లడ్డూ యాత్రను తాడుబంద్ లోని శ్రీ రామాంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News