న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసులు 12 వేలకు పైగానే నమోదవుతున్నాయి. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతూ 72 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 4,46, 387 పరీక్షలు చేయగా, కొత్తగా 12,899 కేసులు బయటపడ్డాయి. వీటిలో మహారాష్ట్ర నుంచి 3883 కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. శనివారం దేశ వ్యాప్తంగా 15 మంది కరోనాతో మృతి చెందగా, ఇప్పటివరకు మృతులైన వారి సంఖ్య 5,24,855కు చేరింది. శనివారం 8518 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4.26 కోట్లు ( 98.62 శాతం) దాటింది. రికవరీలు తక్కువగా ఉంటుండటంతో క్రియాశీల కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 72,474 (0.17 శాతం ) యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా సాగుతున్న వ్యాక్సిన్ డ్రైవ్‌లో శనివారం 13.24,591 మంది టీకాలు తీసుకోగా ఇప్పటివరకు 196 .14 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.
72 వేలు దాటిన క్రియాశీల కేసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -