- Advertisement -
వేలాది మందికి గాయాలు..కిక్కిరిసిన ఆస్పత్రులు
ములెస్ కేయస్(హైతీ): హైతీలో శనివారం సంభవించిన తీవ్ర భూకంపంలో మరణించిన వారి సంఖ్య ఆదివారం 1,297కు పెరిగింది. రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైన భూకంపం తీవ్రతకు వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈకరీబియన్ దేశంలో సంభవించిన ఈ భూకంపానికి సుమారు 5,700 మంది గాయపడగా వేలాదిమంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోవడంతో గాయాలతో కొన్ని వందలమంది ఆసుపత్రుల వెలుపలే చికిత్స కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, సోమవారం రాత్రి నుంచి అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమెరికా జాతీయ తుపాను హెచ్చరిక కేంద్రం హెచ్చరించడంతో హైతీలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.
- Advertisement -