ఛండీగఢ్: పశువుల స్మగ్లర్ అనుకొని 12వ తరగతి విద్యార్థిపై గోసంరక్షకులు కాల్పులు జరపడంతో అతడు మృతి చెందిన సంఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆర్యన్ మిశ్రా అనే విద్యార్థి 12వ తరగతి చదువుతున్నాడు. హర్షిత్, శంకీ అనే స్నేహితులతో కలిసి న్యూడిల్స్ తినడానికి డస్టర్ కారులో ఆర్యన్ బయటకు వచ్చారు. స్నేహితులతో కలిసి వెళ్తుండగా గోసంరక్షకులు వారిని వెంబడించారు. 30 కిలో మీటర్లు వెంబడించిన అనంతరం వారిపై కాల్పులు జరపడంతో ఆర్యన్ ఘటనా స్థలంలో చనిపోయాడు. మిగిలిన ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గోసంరక్షణ పేరుతో అమాయకుల ప్రాణాలు తీయడం సరికాదని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కూడా గోసంరక్షణ పేరుతో అమాయకులపై దాడులు చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
పశువుల స్మగ్లర్ అనుకొని గోసంరక్షకులు కాల్పులు… 12వ తరగతి విద్యార్థి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -