Thursday, January 23, 2025

ఒటిటిలోకి ’12th ఫెయిల్‌’ తెలుగు వెర్షన్… స్ట్రీమింగ్ ఎక్కడంటే?

- Advertisement -
- Advertisement -

భాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించిన ’12th ఫెయిల్‌’ మూవీ ఒటిటిలోకి వచ్చేస్తోంది. బాలీవుడ్ చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ రికార్డులు సృష్టించింది. విడుదల సమయంలో పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. క్రమంగా మౌత్ టాక్ పెరగడం.. మరోవైపు సోషల్ మీడియాలోనూ సినిమాను మెచ్చుకుంటూ సినీ లవర్స్ వీడియో క్లిప్స్ వైరల్ చేయడంతో జనాల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది. దీంతో ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది.  ఇటీవల ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉన్న ’12th ఫెయిల్‌’ మూవీ.. తాజాగా తెలగు, తమిళ్ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు.

’12th ఫెయిల్‌’ సిినమాలో విక్రాంత్‌ మస్సే ప్రధానపాత్రలో నటించారు. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా.. 12వ తరగతి ఫెయిల్‌ అయిన యువకుడు.. ఐపిఎస్‌ ఎలా అయ్యాడనే ఆసక్తికర స్టోరీతో డైరెక్టర్ విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News