Monday, December 23, 2024

సెస్ ఎన్నికల్లో ఓటేసిన 12 ఏండ్ల పిలగాడు

- Advertisement -
- Advertisement -

తంగళ్లపల్లి : సెస్ ఎన్నికల్లో 12 ఏండ్ల పిలగాడు ఓటేసిన వైనం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. సోషల్ మీడియాలో ఓటు వేసినట్లు చూపిస్తు పెట్టిన పోస్టులు వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మండలంలోని నర్సింహుల పల్లె గ్రామానికి చెందిన వేల్పుల రాంచరణ్ (12)పోలీంగ్ బూత్‌లోకి వెళ్లి తన ఓటును వేసి దర్జాగా వచ్చాడు.అక్కడ ఉన్న పోలీంగ్ అధికారులు సైతం ఏమి అనలేదు.దీంతో సహకార సంఘం ఎన్నికల్లో ఇలాంటి వెసులుబాటు ఉంటుందనుకొని అందరూ మిన్నకుండిపోయారు.

ఐతే బాలుడు పెట్టిన ఫోటో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు దృష్టికి విషయం చేరుకుంది. వెంటనే తేరుకున్న వారు 18 ఏళ్లు నిండని వారికి ఓటు వేసే హక్కు ఉండదంటూ నాలుక కరుచుకొని ఆ ఓటు చెల్లదని పరిశీలిస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించడం కొసమెరుపు.12 ఏళ్లకే ఓటు వేసిన బాలుడిగా రాంచరణ్ సంచలనం సృష్టించాడంటూ పలువురు గ్రామస్థులు వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News