Wednesday, January 22, 2025

13.122 మిలియన్ టన్నుల సరుకు రవాణా

- Advertisement -
- Advertisement -

జనవరిలో దమ. రైల్వే అత్యధికమైన నెలవారీ లోడింగ్
దీంతో రూ. 1,296.73 కోట్ల సరుకు రవాణా ఆదాయం నమోదు
సంక్రాంతి , శబరిమల స్పెషల్స్ ప్రత్యేక రైళ్లను నడుపుతూనే ఈ రికార్డు

మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనవరి 2024లో సరుకు రవాణా విభాగంలో అత్యుత్తమ పనితీరుతో ఒక నెలలో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయీ సరుకు రవాణాను సాధించగలిగింది. జోన్ పరిధిలో జనవరి నెలలో 131.22 మిలియన్ టన్నుల ఒరిజినేటింగ్ లోడింగ్‌ను సాధించింది. ఇది ఇప్పటి వరకు సాధించిన నెలవారి సరుకు రవాణా లోడింగ్‌లో  అత్యధికం. కాగా ఇదివరకు సాధించిన అత్యధిక లోడింగ్ మే 2023లో 12.517 మిలియన్ టన్నులుగా ఉండడం గమనార్హం. అలాగే గత సంవత్సరం 2023 జనవరిలో సరుకు రవాణా లోడింగ్ తో పోల్చినప్పుడు 7 శాతం వృద్ధిని సాధించగలిగింది.

లోడింగ్‌లో రికార్డు పనితీరుతో పాటు సరుకు రవాణా ఆదాయం దీటుగాఉంది. తద్వారా దక్షిణ మధ్య రైల్వే జనవరి 2024లో రూ. 1,296.73 కోట్ల సరుకు రవాణా ఆదాయాన్నిసాధించింది. ఇది జోన్ ప్రారంభమైనప్పటి నుండి సరుకు రవాణా విభాగంలోని నెలవారీ ఆదాయాలలో అత్యధిక నెలవారీ ఆదాయంగా నిలుస్తుండడం విశేషం. గడచిన డిసెంబరు 2022లో ఆర్జించిన రూ. 1,280.77 కోట్ల ఆదాయం మునుపటి అత్యుత్తమంగా ఉంది. అలాగే జనవరి 2024 నెలవారీ ఆదాయం గత సంవత్సరం ఇదే మాసంతో పోలిస్తే 6.4 శాతం ఎక్కువగా ఉంది. దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా లోడింగ్‌లో వృద్ధికి దోహదపడుతూ ప్రధాన లోడింగ్ వస్తువులైన బొగ్గు 6.497 మిలియన్ టన్నులు, సిమెంట్ 3.278 మిలియన్ టన్నుల రవాణా చేశారు. వీటితోపాటు మొత్తం సరుకు రవాణాలో దోహదపడిన ఇతర ముఖ్యమైన వస్తువులను తీసుకుంటే.. 0.851 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 0.851 మిలియన్ టన్నుల ఎరువులు, 0.423 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం , 0.375 మిలియన్ టన్నుల ఉక్కు కర్మాగారాల కోసం ముడి పదార్థాలు, 0.200 మిలియన్ టన్నుల కంటైనర్లు ,0.647 మిలియన్ టన్నుల ఇతర వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మొత్తం 13.122 మిలియన్ టన్నులుగా ఉంటోంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ అనేక రకాల కార్యక్రమాలు , ప్రత్యేక చర్యలను అమలు చేయడం ద్వారా దాని సరకు రవాణాను బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. ఇందులోభాగంగా వ్యాగన్ల సరఫరాను క్రమబద్ధీకరించడం, సరుకు రవాణా రైళ్ల కదలికలను పర్యవేక్షించడం మొదలైనవాటికి జోన్ చురుకైన పద్ధతిలో ముందుకు సాగుతోంది.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ అతున్నతమైన పనితీరును కనబరిచి సరకు రవాణాలో మైలు రాయిని అధిగమించినందుకు దక్షిణ మధ్య రైల్వే ఆపరేషన్స్ , కమర్షియల్ బృందాలను అభినందించారు. ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనల పనులతో పాటుగా సంక్రాంతి స్పెషల్స్, శబరిమల స్పెషల్స్ మొదలైన అనేక ప్రత్యేక రైళ్లను జోన్ నడుపుతున్నప్పటికీ , ప్యాసింజర్ , సరకు రవాణా కార్యకలాపాలు రెండింటినీ ఖచ్చితంగా ప్రణాళికాబద్దంగా నిర్వహించడం ఈ అద్భుతమైన విజయానికి దారితీసిందని ఆయన పేర్కొన్నారు. ఈ పేర్కొనదగిన విజయానికి సహకరించిన జట్టు సభ్యులందరి ప్రయత్నాలను ఆయన అభినందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా విభాగంలో రికార్డు వార్షిక పనితీరును సాధించేందుకు ఇదే జోరును కొనసాగించాలని సూచించారు.

Rail Load 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News