Tuesday, November 5, 2024

పేదరికం పరార్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఐదేళ్లలో 13.5 కోట్ల మంది ప్రజలు బహుళస్థాయి పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ తెలిపింది. 2015- 16 , 2019-21 మధ్యకాలంలో ఈ పరిణామం చోటుచేసుకుందని సోమవారం వెలువరించిన నివేదికలో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల్లో త్వరితగతిన పేదరికం తగ్గిందని పేర్కొన్నారు. ‘నేషనల్ మల్టీడైమన్షనల్ పవర్టీ ఇండెక్స్  ప్రగతి సమీక్ష 2023’ పేరిట ఈ నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు సుమన్ బేరీ విడుదల చేశారు.

బహుళ స్థాయిల్లో ఉండే పేదరికం గురించి ప్రత్యేకించి ఆరోగ్యం, విద్యా, జీవన ప్రమాణాల దిశలో లెక్కించి ఈ సూచీని (ఎంపిఐ) రూపొందించారు. నిర్ణీతమైన ఐదేళ్ల కాలంలో పేదరికం త్వరగా తగ్గిందని ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో ఈ తగ్గుదల ఎక్కువగా ఉందని, ఇది ఇంతకు ముందు 32 శాతంగా ఉండగా ఇప్పుడు 19 శాతం అయిందని తెలిపారు. కాగా పట్టణ ప్రాంతాల్లో ఇది ఇంతకు ముందు 8 శాతం పైగా ఉండగా ఇప్పుడు ఇది 5.27 శాతానికి చేరింది. 36 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ సూచీ వివరాలను నివేదికలో పొందుపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News