Wednesday, January 22, 2025

ఉక్రెయిన్‌కు 13.6 బిలియన్ల ఆర్థిక ప్యాకేజి

- Advertisement -
- Advertisement -
13.6 billion financial package to Ukraine
అమెరికా కాంగ్రెస్ ఆమోదం

వాషింగ్టన్: యుద్ధంలో నేరుగా పాల్గొనడం తప్ప ఉక్రెయిన్ ప్రజలకు అన్ని రకాల సాయం అందిస్తామని ప్రతిన బూనిన అమెరికా అందుకు తగ్గట్టే వ్యవహరిస్తోంది. ఆ దేశానికి సైనిక, మానవతా సాయం కింద 13.6 బిలియన్ డాలర్లను అందించనుంది. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక ప్యాకేజికి అమెరికా కాంగ్రెస్( పార్లమెంటు) గురువారం రాత్రి పొద్దుపోయాక ఆమోదముద్ర వేసింది. ‘పుతిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలు ఒంటరి కాబోరని మేము హామీ ఇచ్చాం.ఈ ప్యాకేజిని ఆమోదిస్తే ఆ హామీని నిలబెట్టుకున్న వాళ్లమవుతాం’ అని ఓటింగ్‌కు ముందు సెనేట్ మెజారిటీ నాయకుడు చక్ షుమర్ చెప్పారు. ఈ ప్యాకేజిలో సగభాగం సైనిక అవసరాలకు ఖర్చు చేస్తారు. మిగిలిన సగభాగాన్ని మానవతా, ఆర్థిక సాయంగా ఉక్రెయిన్‌కు అందిస్తారు. కాంగ్రెస్ ఆమోదించిన ఈ ప్యాకేజికి అధ్యక్షుడు బైడెన్ సంతకం తప్పక లభిస్తుందనేది తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News