Sunday, December 22, 2024

వచ్చే ఎన్నికలలో మాదిగలకు 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : వచ్చే ఎన్నికలలో మాదిగలకు 13 అసెంబ్లీ స్థ్ధానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ టిఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేటలోని ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మార్పీఎస్ టీఎస్ డిమాండ్ల సాధన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీల కోసం కేటాయించిన 18 అసెంబ్లీ స్థ్ధానాలు అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు అధిక సీట్లను కేటాయించి రాజకీయ పార్టీలు తమ చిత్త శుద్ధ్దిని నిరూపించుకోవాలన్నారు.

ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఓప్పించాలన్నారు. దళితులకు గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 3 లక్షల సహాయాన్ని 10 లక్షలకు పెంచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజక వర్గానికి 5 వేలమంది దళితులకు అమలు చేయాలన్నారు. డప్పు,చెప్పు వృత్తిదారులకు తక్షణమే రెండు వేల పెన్షన్ మంజూరు చేయాలన్నారు. ఈ డిమాండ్ల సాధనకై జూన్ 30న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాదిగ బంధువులందరు హాజరుకావాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు కాశపాక రాజేందర్, వెంకటేశ్, రాజేందర్, సాయిలు, రాజేందర్, తిరుపతి, నాగభూషణం, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News