Thursday, January 23, 2025

ఈ నెలలో 13 రోజులు బ్యాంక్ సెలవులు

- Advertisement -
- Advertisement -

13 Bank holidays in March

న్యూఢిల్లీ : ఈ నెల (మార్చి)లో బ్యాంకులకు 13 రోజులు సెలవులు ఉన్నాయి. అందువల్ల ఏమైనా పనులు ఉంటే త్వరగా పూర్తి చేసుకోండి. మార్చి మొదటి రోజే మహాశివరాత్రి సెలవు, ఇక హోలీ వంటి పెద్ద పండుగలు ఉన్నాయి. ఆర్‌బిఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) 2022 మార్చి నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెలలో 13 రోజులు బ్యాంకు సెలవులు వచ్చాయి. ఈ సెలవుల్లో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సెలవులు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటాయి. మార్చిలో సెలవుల జాబితా చూస్తే, మార్చి 1న మహాశివరాత్రి, మార్చి 3న (లోసార్) -గ్యాంగ్‌టక్‌లో, మార్చి 4న (చాప్‌చార్ కుట్)- ఐజ్వాల్‌లో బ్యాంక్ మూసివేస్తారు. ఇక మార్చి 6న ఆదివారం, మార్చి 12న రెండో శనివారం, మార్చి 13న ఆదివారం, మార్చి 17న (హోలికా దహన్)-, మార్చి 18న హోలీ సెలవు ఉంటుంది. మార్చి 20న ఆదివారం, మార్చి 22న బీహార్ డే, మార్చి 26న నాలుగో శనివారం, మార్చి 27న ఆదివారం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News