Friday, November 1, 2024

సెప్టెంబరులో 13 రోజుల బ్యాంక్ సెలవులు

- Advertisement -
- Advertisement -

13 bank holidays in September

న్యూఢిల్లీ: ఈ సంవత్సరంలో ఎనిమిదో నెల అంటే ఆగస్టు ముగియబోతోంది. మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. అందువల్ల వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన ముఖ్యమైన పనులు ఉంటే ముందే చూసుకోండి. ఒకసారి సెప్టెంబర్‌లో వచ్చే సెలవుల జాబితాను తనిఖీ చేయండి. దీని వల్ల సరిగ్గా ప్లాన్ చేసుకోగలరు. సెప్టెంబరు నెలలో మొత్తం 13 రోజుల సెలవు ఉండగా, ఇవి ఆయా రాష్ట్రాల ఆధారంగా వేర్వేరుగా ఉంటాయి. సెప్టెంబరు నెలలో విశ్వకర్మ పూజ, ఓనం, నవరాత్రి వంటివి పండుగలు ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం ఆర్‌బిఐ(భారతీయ రిజర్వ్ బ్యాంక్) ప్రతి నెలా బ్యాంక్ హాలిడే జాబితాను విడుదల చేస్తుంది. సెంట్రల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ జాబితాను చూడవచ్చు.

సెలవుల జాబితా -ఇదే..

సెప్టెంబర్ 1న గణేష్ చతుర్థి (పనాజీలో సెలవు), సెప్టెంబర్ -4న ఆదివారం, సెప్టెంబర్ 6న కర్మ పూజ (రాంచీలో సెలవు), సెప్టెంబర్ 7న మొదటి ఓనం (కొచ్చి, తిరువనంతపురంలో), సెప్టెంబర్ 8న తిరు ఓణం (కొచ్చి, తిరువనంతపురంలో సెలవు), సెప్టెంబర్ 9న ఇంద్రజాత్ర (గ్యాంగ్‌టక్‌లో బ్యాంక్ సెలవు), సెప్టెంబర్ 10న శనివారం (2వ శనివారం), సెప్టెంబర్ 11న ఆదివారం, సెప్టెంబర్ 18న ఆదివారం, సెప్టెంబర్ 21న శ్రీ నారాయణ గురు సమాధి దినం, సెప్టెంబర్ 24న శనివారం (4వ శనివారం), సెప్టెంబర్ 25న ఆదివారం, సెప్టెంబరు 26న నవరాత్రి స్థాపన ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News