Monday, December 23, 2024

తమిళనాడులో బీజేపీకి ఎదురుదెబ్బ..

- Advertisement -
- Advertisement -

చెన్నై: బీజేపీ, ఎఐఎడిఎంకె పార్టీ నేతల మధ్య కార్మికుల వేధింపుపై విమర్శలు సాగుతున్నా బీజేపీకి చెందిన 13 మంది కీలక నేతలు బుధవారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ఎఐఎడిఎంకెలో చేరారు. వీరంతా పశ్చిమ చెన్నై లోని బీజేపీ ఐటి విభాగానికి చెందిన వారు. తామంతా సిటిఆర్ నిర్మల్ కుమార్ మార్గాన్ని అనుసరిస్తామని చెప్పారు. నిర్మల్ కుమార్ మాజీ ఐటి బిజెపి విభాగం మాజీ అధినేత. ఆయన ఆదివారం ఎఐఎడిఎంకెలో చేరారు. ఈలోగా టూటికోరన్ బీజేపీ జిల్లా స్థాయి ఒబిసి మోర్చా నేత గోమతి ఎఐఎడిఎంకెలో బుధవారం చేరారు. ఆమెకు ఎఐఎడిఎంకె నేత కదంబూరు రాజు స్వాగతం పలికారు.

మంగళవారం బీజేపీ ఐటి విభాగం మాజీ రాష్ట్ర కార్యదర్శి దిలీప్ కన్నన్, మహిళా నేతతో సహా మరో ముగ్గురు బీజేపీని విడిచిపెట్టి ఎఐఎడిఎంకె నేత కె. పళనిస్వామి సమక్షంలో ఎఐఎడిఎంకెలో చేరారు. తాను బీజేపీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఎలాంటి పదవులను ఆశించలేదని, అయితే పార్టీలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను పార్టీని వీడేలా చేశాయని బీజేపీ ఐటి విభాగం జిల్లా అధ్యక్షుడు అంబరాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అంబరాజన్‌తోపాటు బీజేపీని ఇవాళ వీడిన వారిలో 10 మంది ఐటీ వింగ్ జిల్లా కార్యదర్శులు, ఇద్దరు ఐటీ వింగ్ డిప్యూటీ కార్యదర్శులు ఉన్నారు. అంతకు మునుపే బీజేపీ ఇంటెలెక్చువల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణన్, ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి దిలీప్ కన్నన్, తిరుచ్చి రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్, రాష్ట్ర బీజేపీ వింగ్ కార్యదర్శి అమ్ము అన్నా డిఎంకెలో జాయిన్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News