Sunday, January 19, 2025

పిడుగుపడి 13 పశువులు మృతి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెంలో శనివారం నుంచి ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. ఆళ్లపల్లి మండలంలో పిడుగుపడి 13 పశువులు మృతి చెందాయి. ఆళ్లపల్లి మండలం సందీబంధంలో పిడుగుపాటుకు ఐదు ఆవులు మృతి చెందాయి. సింగారం గ్రామంలో పిడుగుపడి ఎనిమిది పశువులు చనిపోయాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో పిడుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షం పడే సమయంలో అందరూ పొలాల నుంచి ఇంటికి చేరుకోవాలని సూచిస్తున్నారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద అసలు ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. మైదానం ప్రదేశంలో చెవులు మూసుకొని వంగి కూర్చోవాలని సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం పిడుగుపాటు వందల మంది చనిపోవడంతో పాటు జంతువులు కూడా చనిపోతున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News