Sunday, December 22, 2024

ఢిల్లీలో 13 కోచింగ్ సెంటర్లకు సీల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలోని పాత రాజీందర్ నగర్ ప్రాంతంలోనని 13 కోచింగ్ కేంద్రాలను ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) సీల్ చేసిందని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలకు రావుస్ ఐఎఎస్ కోచింగ్ కేంద్రంలోని బేస్‌మెంట్‌లో వరదనీరు ప్రవహించగా ముగ్గురు ఐఎఎస్ అభ్యర్థులు మరణించిన తరువాత అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న సంస్థలపై ఎంసిడి కొరడా ఝళిపించసాగిందని అధికారులు తెలియజేశారు. బేస్‌మెంట్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న కోచింగ్ కేంద్రాలపై చర్య తీసుకునేందుకు పురపాలక సంస్థ బృందం ఒకటి మధ్య ఢిల్లీ కోచింగ్ కేంద్రాలను సందర్శించిందని ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఆదివారం రాత్రి వరకు అటువంటి 13 కోచింగ్ కేంద్రాలను సీల్ చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఆ సంస్థల్లో ఐఎఎస్ గురుకుల్, చాహల్ అకాడమీ, ప్లుటుస్ అకాడమీ, సాయి ట్రేడింగ్, ఐఎఎస్ సేతు, టాపర్స్ అకాడమీ, దైనిక్ సంవాద్, సివిల్స్ డైలీ ఐఎఎస్, కెరీర్ పవర్, 99 నోట్స్, విద్యా గురు, గైడెన్స్ ఐఎఎస్, ఈజీ ఫర్‌ఐఎఎస్ ఉన్నాయి. ‘ఆ కోచింగ్ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా బేస్‌మెంట్లలో పని చేస్తున్నట్లు కనుగొన్నాం. వాటిని వెంటనే సీల్ చేసి, నోటీస్‌లు అంటించాం’ అని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. కాగా, శనివారం వరద ఘటన చోటు చేసుకున్న రావుస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్‌కు పోలీసులు సీల్ వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News