Sunday, December 22, 2024

13 మంది బాలికలపై లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

పశ్చిమబెంగాల్ వైద్యురాలి హత్యాచార సంఘటన దేశంలో తీవ్ర అలజడి సృష్టిస్తుండగా, తమిళనాడులో ఎన్‌సిసి క్యాంపులో 13 మంది బాలికలపై లైంగిక దాడి సంఘటన వెలుగు లోకి వచ్చింది. బాధిత అమ్మాయిలు ఆగస్టు 9 న ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పోలీస్‌లకు ఫిర్యాదు లేకపోవడంతో తల్లిదండ్రుల వరకు వెళ్లింది. వారి ఫిర్యాదు మేరకు పోలీస్‌లు నిందితుడు శివరామన్‌ను, స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు సహా మొత్తం 11 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు. నామ్ తమిళర్ కట్చి అనే రాజకీయ పార్టీకి చెందిన శివరామన్ ఇటీవల కృష్ణగిరి జిల్లా లోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు వెళ్లి అక్కడ ఎన్‌సిసి యూనిట్ లేనప్పటికీ, ఎన్‌సిసి క్యాంప్ నిర్వహించేలా ప్రయత్నించాడు.

దీనివల్ల స్కూల్ కు ఎన్‌సిసి యూనిట్ నిర్వహించే అర్హత వస్తుందని నమ్మించాడు. ఈమేరకు ఆగస్టు 5 నుంచి 9 వ తేదీవరకు నిర్వహించిన క్యాంప్‌కు 41 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 17 మంది బాలికలు ఉన్నారు. అమ్మాయిలకు మొదటి అంతస్తు లోని స్కూల్ ఆడిటోరియం, అబ్బాయిలకు గ్రౌండ్ ఫ్లోర్‌లో వసతి కల్పించారు. దీన్ని పర్యవేక్షించడానికి ఉపాధ్యాయులు లేక పోవడంతో దీన్ని ఆసరా చేసుకున్న శివరామన్ 8 వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెతోపాటు మరో 12 మందిని లైంగికంగా వేధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News