Friday, November 22, 2024

భద్రాచలంలో 13 కేజీల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -
  • నలగురి అరెస్టు.. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

భద్రాచలం : ఆంధ్రాలోని సీలేరు నుంచి హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకొని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు బుధవారం భద్రాచలం పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం భద్రాచలం ఏఎస్పీ పారితోష్‌పంకజ్ ఆదేశాల మేరకు భద్రాచలం పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా మంగళవారం సాయంత్రం గోదావరి కరకట్ట సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఆంధ్రాలోని సీలేరు నుంచి హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న 13 కేజీల గంజాయిని పట్టుకొని నలగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గంజాయిని తెచ్చిన సంతోష్‌కుమార్, మంగళలు మల్కాన్‌గిరికి చెందిన వారు కాగా కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించాలని చూసిన అర్జున్‌సింగ్, అతని భార్య నందినిలు హైదరాబాద్‌కు చెందిన వారు.

వీరు నలుగురు ఒప్పదం కుదుర్చుకొని గంజాయి చేతులు మార్చుతుండగా పోలీసులకు పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణాలో మరొకరి భాగస్వామ్యం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.2 లక్షల 60 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ బెల్లం సత్యనారాయణ, ఎస్సైలు తిరుపతి, శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. భద్రాచలం సీఐ నాగరాజురెడ్డి కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన టాస్క్‌ఫోర్స్, భద్రాచలం పోలీసులను ఏఎస్పీ పారితోష్‌పంకజ్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News