ఖాట్మాండూ: కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి చెందిన సంఘటన నేపాల్‌లోని అచ్ఛమ్ జిల్లాలో జరిగింది. గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. అచ్ఛమ్ జిల్లలోని వివిధ ప్రదేశాలలో కొండ చరియలు విరిగిపడడంతో 13 మంది చనిపోగా 10 మంది గల్లంతయ్యారు. రెస్య్కూ సిబ్బంది పది మందిని కాపాడారు. గల్లంతైన వారి కోసం రెస్యూ సిబ్బంది, భద్రతా సిబ్బంది, స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారని డిప్యూటీ చీఫ్ డిస్ట్రిక్ ఆఫీసర్ దిపేష్ రిజాల్ తెలిపాడు. హెలికాప్టర్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టాలని నేపాల్ హోంమంత్రి బాల క్రిష్ణ ఖండ్ తెలిపారు. గత శనివారం బంగబాగాద్ ప్రాంతంలో భారీ వరదలు రావడంతో ఇద్దరు మృతి చెందగా 11 మంది గల్లంతైన విషయం తెలిసిందే. భారీ వర్షలు కురవడంతో లస్కు, మహాకాళి నదలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ప్రమాదస్థాయిని ధాటి పొంగిపొర్లుతుండడంతో రెండు బ్రిడ్జిలు, ఇండ్లు కొట్టుకపోయాయి.
కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -