Friday, December 27, 2024

పాకిస్థాన్‌లో రోడ్డు ప్రమాదం… 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

13 killed in road accident in Lahore

లాహోర్: పాకిస్థాన్‌లో లాహోర్‌కు 400 కిమీ దూరంలో రహిం యార్ ఖాన్ జిల్లాలో శనివారం సాయంత్రం చెరకు లోడుతో వస్తున్న ట్రక్కు ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొనడంతో 13 మంది దుర్మరణం పాలయ్యారు. బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తరువాత స్థానికులతో కలసి రిస్కు టీమ్‌లు గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఈ అయిదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక మహిళ, పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన చోట వర్షం నీరు రోడ్డుపై నిల్చిపోయి ఉందని, చక్కెర బస్తాలతో బస్సు కప్పుకుపోయిందని అధికారులు చెప్పారు. ట్రక్కు డ్రైవర్ అక్కడ నుంచి తప్పించుకున్నాడు. జిల్లా డిప్యూటీ కమిషనర్ సయ్యద్ మూసా రజా గాయపడిన వారికి మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

13 killed in road accident in Lahore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News