Tuesday, November 5, 2024

దేశంలో 13 లక్షలకు పైగా ఎలెక్ట్రిక్ వాహనాలు: గడ్కరీ వెల్లడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు 13 లక్షలకు పైగా ఎలెక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు కేంద్ర రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. అయితే, ఈ సంఖ్యలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్‌లను మినహాయించినట్లు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానమిస్తూ ఆయన తెలిపారు. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలెక్ట్రిక్ వెహికల్స్(ఎఫ్‌ఎఎంఇ) ఫేస్-2 పథకం కింద 68 నగరాలలో 2,877 పబ్లిక్ ఇవి చార్జింగ్ స్టేషన్లను, 9 ఎక్స్‌ప్రెస్‌వేలు, 16 హైవేలల పొడవునా 1,576 ఇవి చార్జింగ్ స్టేషన్లను మంజూరు చేసినట్లు గడ్కరీ తెలిపారు.

ఈ ఏడాది జులై 14వ తేదీ నాటికి దేశంలో మొత్తం 13,34,385 ఎలెక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్‌లో వాహన్ 4లో వీటి సంఖ్య అందుబాటులో లేదని ఆయన వివరించారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిష్యన్సీ ప్రకారం దేశంలో మొత్తం 2,826 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. జెనీవాలోని అంతర్జాతీయ రోడ్ ఫెడరేషన్‌కు చెందిన వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్(డబ్లుఆర్‌ఎస్) ప్రకారం 2020లో భారత్‌లో 1.5 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 207 దేశాలలో నమోదైన మొత్తం రోడ్డు ప్రమాదాల సంఖ్యలో ఇది 26.37 శాతమని ఆయన వివరించారు.

13 lakh Electric Vehicles Registered in India: Nitin Gadkari

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News