చెన్నై: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ తమిళనాడులో కూనూర్ సమీపంలోని నీలగిరి కొండల్లో కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ ప్రమాద సమయంలో హెలికాఫ్టర్ లో బిపిన్ రావత్, ఆయన భార్య, కూతురుతో సహా మొత్తం 14మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిపిన్ రావత్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రం మంత్రి రాజ్ నాథ్ సింగ్, తమిళనాడు సిఎం స్టాలిన్, ఎపి సిఎం జగన్, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర కెబినేట్ ఉన్నతస్థాయి సమావేశమైంది. అ సమావేశం అనంతరం రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటన చేయనున్నారు.