- Advertisement -
రోమ్: కేబుల్ కారు తెగిపడడంతో 13 మంది మృతి చెందిన సంఘటన ఉత్తర ఇటలీలోని స్టెసా ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని ఇటలీ ప్రజలు తెలిపారు. మాగియోర్ సరస్సు అందాలను ఎత్తైన ప్రదేశం నుంచి పర్యాటకులు వీక్షించేందుకు మొటారోన్ పర్వతంపై కేబుల్ కారు మార్గాన్ని స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పర్వత శిఖరం కిందిభాగానికి వంద మీటర్ల దూరంలో కారు కేబుల్ తెగిపడిపోవడంతో 13 మంది మృతి చెందారు. కేబుల్ కారు పల్టీలు కొడుతూ చెట్లను ఢీకొట్టడంతో పర్యాటకులు చెల్లాచెదురుగా పడిపోయారు. 2016లోనే ఈ కేబుల్ లైన్ ను పునర్ నిర్మించారని స్టెసా మేయర్ మార్సెల్లా సెవెరినో పేర్కొన్నారు. 1998 తరువాత జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదేనని స్థానిక మీడియా తెలిపింది.
- Advertisement -