Monday, December 23, 2024

బాలసోర్ రైలు ప్రమాదం..మరో 13 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : గతనెల జూన్ 2న బాలసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతులైన వారిలో మరో 13 మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు భువనేశ్వర్ లోని ఎయిమ్స్‌లో ఈ మృతదేహాలను భద్రపరిచారు. డిఎన్‌ఎ పరీక్ష ద్వారా గుర్తించిన 29 మంది మృతదేహాల్లో శుక్రవారం ఆరు మృతదేహాలను అప్పగించగా, శనివారం 13 మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించామని రైల్వే అధికార వర్గాలు పేర్కొన్నాయి.

13 మృతదేహాల్లో నాలుగు బీహార్‌కు పంపగా, ఎనిమిది పశ్చిమబెంగాల్‌కు, ఒకటి ఝార్ఖండ్‌కు పంపారు. ఈ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా చెల్లించడమైందని చెప్పారు. సంబంధీకులు వచ్చి అడిగే వరకు మృతదేహాల అప్పగింత కొనసాగుతుందని తెలిపారు. ఇంకా 62 మృతదేహాలను గుర్తించ వలసి ఉందని, వాటిని ఎయిమ్స్‌లోనే భద్రపరిచినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News