Monday, December 23, 2024

13 కొత్త మండలాలు

- Advertisement -
- Advertisement -

13 new mandals have been formed in Telangana

అభ్యంతరాల స్వీకరణకు 15 రోజుల గడువు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 13 మండలాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మండలాల ఏర్పాటుతో ఆయా మండలాలకు చెందిన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఆకాంక్షలు, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ జిల్లాల్లో నూతన మండలాల ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

నారాయణపేట జిల్లాలోని గుండుమల్, కొత్తపల్లెలు

నారాయణపేట జిల్లాలోని గుండుమల్, కొత్తపల్లె మండలాలు ఏర్పాటు కానుండగా, వికారాబాద్ జిల్లాలోని తాండూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో దుడ్యాల్, మహబూబ్‌నగర్ జిల్లాలో కౌకుంట్ల మండలంగా ఏర్పాటు కానుంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆలూర్, డొంకేశ్వర్‌లు కొత్త మండలాలుగా, ఇదే జిల్లాలోని బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సాలూర కొత్త మండలంగా ఏర్పాటు కానుంది. మహబూబాబాద్ జిల్లాలో సీరోల్, నల్గొండ జిల్లాలోని గట్టుప్పల్‌లు కూడా మండలాలు కొలువు తీరనున్నాయి.

ప్రస్తుతం 594 మండలాలు

కొత్త మండలాలకు సంబంధించి ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యంతరాలకు 15 రోజుల గడువు ఇచ్చింది. అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందించాల్సి ఉంటుం ది. వాటిని పరిశీలించాక తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 594 మండలాలు ఉండగా కొత్తగా 13 మండలాలు కలిపితే 607కు చేరుకుంటాయి.

జిల్లా పేరు                                      కొత్త మండలం

నారాయణపేట                               గుండుమల్, కొత్తపల్లె

వికారాబాద్                                     దుడ్యాల్

మహబూబ్‌నగర్                               కౌకుంట్ల

నిజామాబాద్                               ఆలూర్, డొంకేశ్వర్, సాలూర

మహబూబాబాద్                                సీరోల్

నల్గొండ జిల్లా                                  గట్టుప్పల్

సంగారెడ్డి జిల్లా                               నిజాంపేట్

కామారెడ్డి జిల్లా                                డోంగ్లి

జగిత్యాల జిల్లా                            ఎండపల్లి, భీమారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News