- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు కోసం 13 కంపెనీలతో ప్రభుత్వం శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా రాష్ట్రానికి రూ. 4 లక్షల 80 వేల 750 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న వాటిలో రెనెవెబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు 45 వేల 75 మెగావాట్లు,
పంపుడ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు ద్వారా 15 వేల 200 మెగావాట్లు, గ్రీన్ హైడ్రోజన్ , గ్రీన్ అమ్మోనియా ద్వారా 4 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధంతో కొత్తగా ప్రాజెక్టులు రానున్నాయి. రాష్ట్రంలో వీటి ద్వారా 62 వేల 850 మందికి ఉద్యోగ, ఉపాధి లభించనుంది.
- Advertisement -