Sunday, December 22, 2024

పెళ్లిబృందం ట్రాక్టర్ బోల్తా..13 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి పెళ్లి బృందంతో వెళ్తున్నట్రాక్టర్ బోల్తాపడి 13 మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఐదుగురు మహిళలు ఉన్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స కోసం భోపాల్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు జిల్లా కలెక్టర్ హర్ష్‌దీక్షిత్ చెప్పారు. రాజస్థాన్ లోని మోతీపురాకు చెందిన పెళ్లి బృందం మధ్యప్రదేశ్ లోని కులంపూర్‌లో జరిగే పెళ్లికి ట్రాక్టర్‌లో బయలుదేరారు. ట్రాక్టర్ ట్రాలీలో మహిళలు, చిన్నారులు మొత్తం 40 నుంచి 45 మంది వరకు ఉన్నారు.

రాజ్‌గఢ్ జిల్లా లోని పిప్‌లోడి సమీపం లోకి రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో దాని కింద నలిగి నలుగురు చిన్నారులతోసహా 13 మంది మరణించారని పోలీస్‌లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీస్‌లు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. పోస్ట్‌మార్టమ్ తరువాత మృతదేహాలను రాజస్థాన్ లోని మోతీపురా గ్రామానికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ఎంపీ సిఎం మోహన్‌యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజస్థాన్ సిఎం భజన్‌లాల్ శర్మ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News