Sunday, December 22, 2024

చైనా పాఠశాలలో అగ్నిప్రమాదం: 13 మంది విద్యార్థుల మృతి

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనా లోని యింగ్‌కై పాఠశాల వసతి గృహంలో శుక్రవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో 13 మంది విద్యార్థులు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రికి తరలించారు. హెనాన్ ప్రావిన్స్ లోని యన్‌షాన్‌పు గ్రామంలోని పాఠశాల వసతి గృహంలో శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్ప గలిగారు. మృతులంతా మూడో తరగతి విద్యార్థులేనని పాఠశాల ఉపాధ్యాయుడు చెప్పారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియ వలసి ఉంది. ఇప్పటికి పాఠశాల హెడ్‌ను పోలీస్‌లు అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News