- Advertisement -
హైదరాబాద్: జలమండలిలో పనిచేస్తున్న 13 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. బోర్డులోని వివిధ విబాగాల్లో విధులు నిర్వహిస్తున్న డిప్లొమా, బీటెక్ విద్యార్హతలు కలిగిన వారికి జలమండలి టెక్నికల్ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పించారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులకు జలమండలి పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్‌బాబు సోమవారం ఉత్తర్వులు అందజేసి అభినందించారు. ఈకార్యక్రమంలో సీజీఎం మహ్మద్ అబ్దుల్ ఖాదర్, జీఎం టీవీ సరస్వతి, వాటర్ వర్క్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షులు రాంబాబుయాదవ్, ప్రధానకార్యదర్శి జయరాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్లు రాజిరెడ్డి, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -