Monday, December 23, 2024

పెళ్లి వేడుకలో విషాదం

- Advertisement -
- Advertisement -
13 women die after accidentally falling into well
బావిలో పడి 13మంది మహిళలు మృతి
యుపిలోని కుశినగర్ జిల్లాలో దుర్ఘటన

కుశినగర్: పెళ్లి వేడుకలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకకు వెళ్లిన 13 మంది మహిళలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్ జిల్లా నౌరంగియా టోలా గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి వేడుకకు వెళ్లిన మహిళలు బుధవారం రాత్రి ‘హల్దీ వేడుక జరుగుతున్న సమయంలో సమీపంలోని బావిపై మూతగా అమర్చిన ఐరన్ గ్రిల్‌పై కూర్చున్నారు. అది ఒక్క సారిగా కూలిపోవడంతో వారంతా బావిలో పడిపోయారు. 11 మంది మహిళలు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. బావిలో పడిన కొంతమందిని స్థానికులు రక్షించారు. ఈ సంఘటనలో మరో 10 మంది గాయపడినట్లు, వారిని ఆస్పత్రిలో చేర్చినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ రాజలింగం చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ.4 లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. క్షతగాత్రులకు సరయిన వైద్యం అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News