Wednesday, January 22, 2025

ఫోన్‌తో ఆడొద్దని తల్లి మందలించినందుకు బాలుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ఫోన్‌తో ఎక్కువ సేపు ఆడొద్దని తల్లి మందలించినందుకు మనస్తాపం చెందిన 13 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం…. తిప్పన్నపేటకు చెందిన మ్యాడ నరేశ్, జల దంపతులకు సాయిచరణ్ (13) కుమారుడు ఉన్నాడు. తిప్పన్నపేట శివారులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం సాయిచరణ్ జారిపడగా కాలుకు చిన్న గాయమైంది. దీంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. పాఠశాలకు వెళ్లకుండా ఉదయం నుంచి ఫోన్‌తో ఆడుతుండగా ఎంత సేపు ఫోన్‌తో ఆడతావు…

పడుకో అంటూ తల్లి మందలించి సాయిచరణ్ చేతిలో ఉన్న ఫోన్‌ను తీసుకుంది. దీంతో మనస్తాపం చెందిన సాయిచరణ్ ఇంట్లోని దులానికి టవల్‌తో ఉరివేసుకున్నాడు. అయితే శబ్దం విన్న తల్లి బెడ్‌రూం నుంచి బయటకు రాగా దూలానికి వేలాడుతూ సాయిచరణ్ కనిపించాడు. దీంతో తల్లి పెద్దగా అరవడంతో పక్కింటిలోని మహేశ్ వచ్చి సాయిచరణ్‌ను కిందికి దించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి తండ్రి ఉపాధి కోసం ఏడాది క్రితం దుబాయ్ వెళ్లగా ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో బాలుడి తల్లి గుండెలవిసేలా రోదించింది. బాలుడి తల్లి జల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News