Monday, January 13, 2025

ఐఎఎస్‌లో 1300..ఐపిఎస్‌లో 586 ఉద్యోగాలు ఖాళీ

- Advertisement -
- Advertisement -

ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ (ఐఎఎస్)లో 1316, ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపిఎస్) లో 586 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ గురువారం లిఖిత పూర్వకంగా రాజ్యసభలో వెల్లడించారు. ఐఎఎస్‌లో మొత్తం 6858 ఉద్యోగాలు మంజూరు సామర్థంలో ఉండగా, 2024 జనవరి 1 నాటికి 5542 మంది అధికారులను నియమించడమైందని, అలాగే 5055 ఐపిఎస్ ఉద్యోగాలకు గాను 4469 మందిని నియమించడమైందని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న 1316 ఐఎఎస్ ఉద్యోగాలలో 794 ఉద్యోగాలకు నేరుగా నియామకం జరుగుతుందని, మిగతా 522 ప్రొమోషన్ ఉద్యోగాలుగా పేర్కొన్నారు.

586 ఐపిఎస్ ఖాళీ ఉద్యోగాల్లో 209 ఉద్యోగాలకు నేరుగా రిక్రూట్ చేయడమౌతుందని,377 ప్రొమోషన్ ఉద్యోగాలని వివరించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) 3193 ఉద్యోగాలకు గాను 2151 ఉద్యోగాలను భర్తీ చేయడమైందని, ఖాళీగా ఉన్న 1042 ఉద్యోగాలలో 503 డైరెక్టు రిక్రూట్‌మెంట్ అవుతాయని, మిగతా 539 ప్రొమోషన్ ఉద్యోగాలుగా పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలన్నీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేయడమౌతుందని చెప్పారు. జనరల్, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు సంబంధించి గత ఐదేళ్లలో జరిగిన నియామకాలను వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News