- Advertisement -
జమ్ము: బిఎస్‌ఎఫ్ జవాన్లు జమ్ము జిల్లాలోని భారత్‌పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద 131 అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకను ఎగురవేశారు. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎస్‌ఎఫ్ జమ్ముప్రాంత ఐజి ఎన్‌ఎస్ జమ్వాల్ భారత జాతీయ జెండాను ఎగురవేశారు. 131 అడుగుల ఎత్తైన పోల్‌పై 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు జెండాను ఎగురవేశారు. ఈ జెండా రూపకల్పనకు లుపిన్ ఫౌండేషన్, జెకె టూరిజం స్పాన్సర్లుగా వ్యవహరించాయి. ఆక్ట్రాయ్ బార్డర్ ఔట్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ జెండా పర్యాటకులను ఆకర్షిస్తుందని బిఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. పాక్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా ఈ జెండా కనిపిస్తుంది.
- Advertisement -