Monday, December 23, 2024

త్వరలో ఆర్‌టిసి వరంగల్ రీజియన్‌లో 132 ఎలక్ట్రిక్ బస్సులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టి సి వరంగల్ రీజియన్‌కు త్వరలో 132 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్‌టి సి ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్ కార్యాలయంలో ఇటీవలే సమీక్ష నిర్వహించారు. రీజియన్ పరిధిలోని పలు డిపోల్లో ఎలక్ట్రిక్ బ స్సులు నడపాల్సిన రూట్లు, సాధ్యాసాధ్యాల గురించి అధికారులు చర్చించారు. బస్ డిపోల్లో ఫాస్ట్ చార్జీంగ్ పా యింట్లతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టనున్నారు. ఈ బస్సులకు సంబంధిం చి పలు బస్‌డిపోల వద్ద ఫాస్ట్ ఛార్జీం గ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు.

మొదటి దశలో 132 ఎలక్ట్రిక్ బస్సుల ను ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 41 సీట్ల తో ఈ బస్సులు అందుబాటులోకి రానుండగా ఒక్కసారి ఛార్జీంగ్ చేస్తే 325 కిలోమీటర్లకు పైగా ఈ బస్సు లు ప్రయాణించనున్నాయి. ప్రయాణికుల భద్రత నిమిత్తం బస్సులో కనీసం మూడు సిసి టివి కెమెరాలను ఏర్పా టు చేస్తున్నారు. ఈ సిసిటివి కెమెరాలను టిఎస్ ఆర్‌టిసి కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News