Sunday, January 19, 2025

భారీగా బదిలీలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో అధికారుల బదిలీలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 132 మంది తహసీల్దార్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో మల్టీ జోన్ 1లో 84 మంది, మల్టీ జోన్ 2లో 48 మంది తహసీల్దార్‌లను ప్రభుత్వం బదిలీ చే సింది. కాగా ఒకే చోట మూడేళ్లు పనిచేసేవా రు, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న వా రిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కలెక్టర్లను కూడా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 32 మంది డిప్యూటీ కలెక్టర్‌ల బదిలీలు జరిగా యి. పలువురు అధికారులకు పదోన్నతులు ఇచ్చి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News